హైదరాబాద్: 28°C
క్రీడలు

ఎట్టకేలకు ఫాంలోకి జైస్వాల్

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి 61 పరుగులు సాధించాడు. అయితే హాఫ్ సెంచరీ అనంతరం జైస్వాల్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అతను వ్యూహాత్మకంగా తప్పుకున్నాడా, స్వల్ప గాయమా అన్నది తెలియాల్సి ఉంది.