హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ వయసుపై బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసుపై జరుగుతున్న చర్చకు ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ స్పందించాడు. వైభవ్ వయసు 15 లేదా 18 ఏళ్లు అయితే సమస్య ఏమిటని ప్రశ్నించాడు. వయసుతో తనకు సంబంధం లేదని, అతను అద్భుతంగా క్రికెట్ ఆడుతున్నాడని ప్రశంసించాడు. భారత్‌కు లభించిన గొప్ప ఆణిముత్యమని, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాడని బ్రెట్ లీ కొనియాడాడు.