హైదరాబాద్: 28°C
క్రీడలు

టెన్నిస్ ప్లేయర్ ఆర్యనా సబలెంకాకు షాక్

మహిళా టెన్నిస్ నంబర్ వన్ ప్లేయర్ ఆర్యనా సబలెంకాకు టొరంటో మాస్టర్స్‌లో షాక్ తగిలింది. నాలుగో రౌండ్‌లోనే ఆమె ఇంటిముఖం పట్టింది. ఆమెతో పాటు మరో స్టార్ జెస్సికా పెగులా కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరికొన్ని రోజుల్లో యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది. రష్యాకు చెందిన 16వ సీడ్ ఎకటెరినా అలెక్జాండ్రోవా 7-6 (7/3), 4-6, 6-4 తేడాతో సబలెంకాపై విజయం సాధించింది.