హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భద్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు

భద్రాసనం (భద్రమైన లేదా దయగల భంగిమ) వేయడం వల్ల తుంటి కీళ్లు వంగుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మోకాళ్లు, పిక్కలు, కటి భాగంలోని కండరాలకు మంచి రక్తం అంది శక్తి లభిస్తుంది. పొత్తికడుపు భాగంలోని అవయవాలపై ఒత్తిడి పడి మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తొలగుతాయి. స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. నెలసరి నొప్పులు తగ్గుతాయి. మెదడుకు ప్రశాంతత దొరుకుతుంది.