హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా శ్రీలంకలో టెస్టు మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులు తక్కువ సంఖ్యలో వస్తుంటారు. దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, తొలి టెస్టు 15-19 వరకు, రెండో టెస్టు 23-27 వరకు జరగనుంది.