హైదరాబాద్: 28°C
క్రీడలు

పడిక్కల్ సెంచరీ.. ఫస్ట్ డౌన్‌కి గట్టి పోటీ

శ్రీలంకXIతో జరుగుతున్న 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో దేవదత్‌ పడిక్కల్ సెంచరీ(103) చేశాడు. లంకతో 15 నుంచి జరగబోయే టెస్టులో ఫస్ట్ డౌన్‌లో సాయి సుదర్శన్ ఆడాలా లేక పడిక్కల్ ఆడాలా అనే ప్రశ్నకు ఈ సెంచరీతో పడిక్కల్ సమాధానమిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో లంక XI ఓవర్‌నైట్ స్కోరు 363/8 వద్ద డిక్లేర్ చేయగా.. టీమిండియా 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.