హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యవంశీ స్పెషాలిటీ ఇదే: శిఖర్ ధావన్

మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.. వైభవ్ సూర్యవంశీ ఆటతీరును ప్రశంసించాడు. చిన్న వయసులోనే పరిణతితో ఆడటం అతడి ప్రత్యేకత అని తెలిపాడు. దూకుడైన స్ట్రోక్ ప్లేతో పాటు నిర్భయంగా ఆడే మనస్తత్వం అతడిలో ఉందన్నాడు. 15 ఏళ్లకే స్టార్ బౌలర్లపై ఆధిపత్యం చూపించడం అద్భుతమని పేర్కొన్నాడు. నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో వైభవ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ధావన్ అభిప్రాయపడ్డాడు.