హైదరాబాద్: 28°C
క్రీడలు

పదేళ్ల తర్వాత భారత్‌కు రెండో పతకం

భారత యువ అథ్లెట్‌ ఆశిశ్‌ యాదవ్‌ జావెలిన్‌ త్రోలో సత్తా చాటాడు. ప్రపంచ U20 ఛాంపియన్‌షిప్స్‌లో 74.09 మీటర్ల దూరం విసిరి రజత పతకం సాధించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాన్‌ హెడ్రిక్‌ హైమన్స్‌ 80.50 మీటర్లతో స్వర్ణం గెలిచాడు. పదేళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో భారత్‌కు రెండో పతకం అందించిన అథ్లెట్‌గా ఆశిశ్‌ నిలిచాడు.