హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంకతో మ్యాచ్.. జైశ్వాల్ డకౌట్

కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఓవర్‌లోనే విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. లెఫ్ట్‌ఆర్మ్ పేసర్లపై జైశ్వాల్ ఇబ్బంది పడుతున్న సమస్య మరోసారి బయటపడింది. శ్రీలంక ఎలెవన్ 363/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.