హైదరాబాద్: 28°C
క్రీడలు

వచ్చే సీజన్‌కు SRH కెప్టెన్ దూరం!

ఐపీఎల్‌ 2027 సీజన్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ తదితరులు ఆడటంపై సందిగ్ధత నెలకొంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా కిక్కిరిసిన షెడ్యూల్‌తో ఉండటంతో ఆటగాళ్ల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌ ఆడటంపై క్రికెట్‌ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోనుంది. కమిన్స్‌ రాకపోతే SRHకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.