హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ ఆర్టికల్ నా జీవితాన్ని మార్చేసింది:అశ్విన్

మాజీస్పిన్నర్ అశ్విన్ తన తొలి ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సంజయ్ మంజ్రేకర్ రాసిన విమర్శాత్మక ఆర్టికల్ తన జీవితాన్ని మార్చిందని చెప్పాడు. ఫిట్నెస్‌పై చేసిన విమర్శలు అప్పట్లో తనకు కోపం తెప్పించినా.. వాటిని సవాలుగా తీసుకుని ఫిట్నెస్‌పై మరింత దృష్టి పెట్టానన్నాడు. 2015లో మంజ్రేకర్ తనను ప్రశంసిస్తూ రాసిన ఆర్టికల్‌కు ధన్యవాదాలు తెలిపానని అశ్విన్ గుర్తుచేసుకున్నాడు.