హైదరాబాద్: 28°C
క్రీడలు

హర్భజన్‌కు అశ్విన్ డైహార్డ్ ఫ్యాన్

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు తాను డైహార్డ్ ఫ్యాన్‌నని రవిచంద్రన్ అశ్విన్ తెలిపారు. కెరీర్ ప్రారంభంలో హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించేవాడినని చెప్పారు. అండర్-19 రోజుల్లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేసినప్పుడు అతడినే అనుసరించేవాడినన్నారు. అతని మ్యాచ్‌లన్నీ ఆసక్తిగా చూసేవాడినని అశ్విన్ గుర్తుచేసుకున్నారు.