హైదరాబాద్: 28°C
క్రీడలు

అన్ని క్రీడలను ఆదరించాలి: కామన్వెల్త్ విజేత

కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్, పారా అథ్లెట్ శుభమ్ జుయల్ స్వస్థలం రూర్కీకి చేరుకోగా స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్‌తో పాటు అన్ని క్రీడలను ప్రజలు సమానంగా ఆదరించాలని కోరాడు. తన విజయానికి ఆర్మీ, కుటుంబసభ్యులే కారణమని చెప్పాడు. లాస్ ఏంజిల్స్ పారాలింపిక్స్-2028లో పతకం సాధించడమే తన లక్ష్యమని వెల్లడించాడు.