హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అరటి పువ్వుతో అద్భుత ప్రయోజనాలు

అరటి పండు కంటే అరటి పువ్వులోనే అత్యధిక పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు వంటకాల రూపంలో తీసుకోవాలి. మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. పాలిచ్చే తల్లులకు కూడా ఇది మంచి ఆహారం.