హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులపై చర్చ

MDK: గ్రామాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ హవేలిఘణపూర్ మండలం బూర్గుపల్లి పంచాయతీ కార్యాలయంలో సాయంత్రం గ్రామసభ నిర్వహించారు. సీసీ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి వరుసక్రమంలో చర్యలు తీసుకుంటామని సర్పంచ్ సాయిలు వివరించారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని బాగుచేస్తామన్నారు. ఈ సభలో పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.