SDPT: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కోహెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత రంగానికి విశేష సేవలందించిన కొండబత్తిని రాజలింగం, ఆకుబత్తిని భూమయ్య, నక్క సత్తయ్యలను ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షుడు గొరిట్యాల లక్ష్మణ్ అధ్యక్షతన సంఘం నాయకులు, సభ్యులు, కుల బంధువులు పాల్గొని చేనేత పరిశ్రమ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
పద్మశాలీలకు ఘన సన్మానం


