చాలా మంది గంటల తరబడి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటుంటారు. దీనివల్ల రిలాక్సేషన్ దొరికినా, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిరంతరం శబ్దాలు వినడం వల్ల వినికిడి శక్తి క్రమంగా తగ్గి చెవుల్లో హోరు రావచ్చు. అలాగే మెదడు అలసట చెంది తలనొప్పి, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. సంగీతాన్ని మితంగా, పరిమిత శబ్దంతో ఆస్వాదించడం చాలా ముఖ్యం.
ఆరోగ్యం
గంటల తరబడి మ్యూజిక్ వింటున్నారా..?


