TG:జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యవసాయం, చేనేత రెండు కళ్లు అని పేర్కొన్నారు. చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ఇందిరమ్మ చీరలు ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. చేనేత రంగ అభివృద్ధికి రూ.1300కోట్లు ఖర్చు చేశామని, ప్రతి ఒక్కరూ వారంలో 2రోజులు చేనేత దుస్తులు ధరించాలని కోరారు.
వార్తలు
చేనేత మన సంస్కృతికి ప్రతీక: మంత్రి


