హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాత్రి ఏమీ తినకుండా పడుకుంటున్నారా?

రాత్రి భోజనం మానేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు తగ్గాలనే ఉద్దేశంతో డిన్నర్ పూర్తిగా స్కిప్ చేస్తే శరీరానికి అవసరమైన శక్తి తగ్గి, ఆకలి పెరగడం, అలసట, రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి డిన్నర్ మానేయకుండా, తక్కువ పరిమాణంలో పోషకాహారం తీసుకుని, నిద్రకు 2–3 గంటల ముందు భోజనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.