హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ తన కార్యాలయంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్యాంప్ కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ప్రజల తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.