భారత మహిళల క్రికెట్ జట్టు ఈ ఏడాది చివరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భారత్.. సఫారీలతో ఒక టెస్టు, 3వన్డేలు ఆడేలా ముందుగా షెడ్యూల్ రూపొందించారు. తాజాగా ఈ షెడ్యూల్ సవరించి మూడు టీ20లు జోడించినట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. డిసెంబరు 9 నుంచి 30 వరకు సిరీస్ కొనసాగుతుంది. రానున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ టీ20లు కీలక సన్నాహకంగా మారనున్నాయి.
క్రీడలు
ఇండియా-సౌతాఫ్రికా కొత్త షెడ్యూల్ ఇదే


