హైదరాబాద్: 28°C
క్రైమ్

పాఠశాలలో పాముకాటు.. విద్యార్థి మృతి

TG: నారాయణపేట జిల్లాలోని ఎక్లాస్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న రంజిత్‌(8) తరగతి గదిలో ఉండగా పాము కాటు వేసింది. వెంటనే ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.