కర్ణాటకలోని యాద్గిర్ మండలం కడేచూరులో ఉన్న ఓ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై, దాన్ని పీల్చడంతో ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం రాయచూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల్లో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఆలంపల్లికి చెందిన గణేశ్ ఉన్నాడు.
క్రైమ్
ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి


