TG: హైదరాబాద్ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్లో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. లిఫ్ట్ లోపల ఒక్క కాలు పెట్టగానే.. డోర్లు వేయకుండానే ఆ లిఫ్ట్ కదిలింది. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా మహిళ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న కాలు.. మహిళ మృతి


