హైదరాబాద్: 28°C
క్రైమ్

27 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్

TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారికి స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించారు. కాగా, అన్నంలో పురుగులు వస్తున్నాయని, భోజనం బాగుండడం లేదని విద్యార్థినులు వాపోయారు.