హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. 6 నెలల కుమారుడిని డ్రైనేజీలో ముంచి!

UPలోని మీరట్‌లో దారుణం జరిగింది. షబ్నమ్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విశాల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో అతనితో వెళ్లిపోయింది. అయితే, తనతో పాటు ఆరు నెలల కుమారుడిని తీసుకెళ్లగా.. ప్రియుడు అంగీకరించలేదు. దీంతో విశాల్‌తో కలిసి తన కుమారుడిని డ్రైనేజీలో ముంచి హత్య చేసింది. భర్త ఇమ్రాన్ ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.