TG: ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కుల మెమోలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చిరగని, తడవని 'నాన్ టియరబుల్' సింథటిక్ మెటీరియల్తో రూపొందించిన డిజిటల్ మెమోలను అందజేయనుంది. దీనివల్ల విద్యార్థులు ప్రత్యేకంగా ల్యామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ నిర్ణయాన్ని ఈ ఏడాదే అమలు చేస్తూ, ఆగస్టు 15 లోగా విద్యార్థులకు వీటిని అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వార్తలు
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం


