హైదరాబాద్: 28°C
వార్తలు

చిన్నారి చేతికి స్టీరింగ్.. పొలంలోకి దూసుకెళ్లిన కారు

VKB: ధారూర్ మండలం ఎబ్బనూరు గేటు వద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కారు నడుపుతున్న వ్యక్తి రెండేళ్ల చిన్నారి చేతికి స్టీరింగ్ ఇవ్వడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వాహనదారులు ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలకు పాల్పడవద్దని స్థానికులు సూచిస్తున్నారు.