హైదరాబాద్: 28°C
క్రైమ్

బొమ్మను మింగి బాలుడు మృతి

కర్ణాటకలో తీవ్ర విషాదం జరిగింది. కర్ణాటకలోని మైసూరు జిల్లాలో చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మను మింగేయడంతో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చిప్స్ తింటూ ఆ ప్యాకెట్‌లో ఉచితంగా వచ్చిన ప్లాస్టిక్ బాల్‌తో ఆడుకుంటున్న క్రమంలో అనుకోకుండా ఆ బొమ్మను నోట్లో వేసుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. బాలుడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు.