హైదరాబాద్: 28°C
వార్తలు

అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

మహిళలు మతాన్ని పాటించే అంశంలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిర్ణీత వయస్సు వచ్చిన మహిళలు (అడల్ట్ ఉమన్) తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని ఆదేశించింది. పెళ్లి, మతాన్ని స్వీకరించడం, నివాసం, భవిష్యత్ వంటి విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని చెప్పింది. ఇద్దరు యువతులకు సంబంధించి దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు విచారించింది.