హైదరాబాద్: 28°C
క్రైమ్

ఎయిర్‌పోర్ట్‌లో గంజాయి కలకలం

ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో గంజాయి కలకలం సృష్టించింది. 2.7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ బాక్సుల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, పక్కా సమాచారంతోనే ఈ ఘటనను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.