హైదరాబాద్: 28°C
క్రైమ్

అగ్నిప్రమాదం.. స్కూల్ బస్సు దగ్ధం

AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పుట్లూరు రైల్వే గేట్ సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. స్కూల్ ఆవరణలో నిలిపి ఉంచిన బస్సులకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సు పూర్తిగా దగ్ధం కాగా, పక్కనే ఉన్న మరో రెండు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.