ఇండోనేషియాలోని మదురా దీవి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 271 మంది ప్రయాణికులు, సిబ్బందితో సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీలో (పడవ) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 41 మంది సముద్రంలో గల్లంతైనట్లు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఐదుగురు మృతి.. 41 మంది గల్లంతు


