హైదరాబాద్: 28°C
క్రైమ్

ఫ్రెండ్‌షిప్ డే రోజున విషాదం.. ఇద్దరు గల్లంతు

AP: స్నేహితుల దినోత్సవం రోజు విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రెండ్‌షిప్ డేను సరదాగా గడిపేందుకు వచ్చిన స్నేహితుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. పాతగంగవరం బీచ్‌లో ఫొటో దిగుతూ నీతు అనే యువతి అలలకు కొట్టుకుపోయింది. స్నేహితురాలిని కాపాడేందుకు వెళ్లి రాము అనే యువకుడు కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.