హైదరాబాద్: 28°C
క్రైమ్

బ్రహ్మపుత్ర నదిలో గల్లంతైన విద్యార్థిని మృతి

AP: అసోం బ్రహ్మపుత్ర నదిలో గల్లంతైన కడప విద్యార్థిని చేతన(20) మృతిచెందింది. స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర చూసేందుకు వెళ్లిన ఆమె.. నది ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్‌రెడ్డికి చేతన ఏకైక కుమార్తె. ఐఐటీ గౌహతిలో ఆమె సెకండియర్ చదువుతుంది. కుమార్తె మరణవార్త విన్న సాయినాథ్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి అసోంకి వెళ్లారు.