హైదరాబాద్: 28°C
వార్తలు

క్లౌడ్‌బరస్ట్‌.. నిలిచిన రాకపోకలు

జమ్మూకశ్మీర్ బందిపోరాలో క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో బందిపోరా- శ్రీనగర్ రహదారిపై వరద ప్రవహిస్తోంది. ఫలితంగా ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మల్పోరా, సదర్‌కూట్‌లో ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.