హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రేషన్ మాఫియాపై కఠిన చర్యలు

గుంటూరులో రేషన్ అక్రమాలను అరికట్టేందుకు అన్ని రేషన్ దుకాణాల్లో నెలలోపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. అనుమానాస్పద దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. పౌర సరఫరాల శాఖ అధికారిణి కోమలి పద్మ మాట్లాడుతూ.. రేషన్ మాఫియాపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.