హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రభుత్వ కార్యాలయాలకు సొంతభవనాలు నిర్మించాలి'

NGKL: పదర మండల కేంద్రంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు సొంత భవనాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం ఆసుపత్రి ఆవరణలో కొనసాగుతోందన్నారు. MLA వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని మండల కేంద్రంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.