హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల జాతరకు హాజరైన కాంగ్రెస్ నేత

RR: మహేశ్వరం నియోజకవర్గం మంఖాల్ డివిజన్‌లో శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర TUFIDC ఛైర్మన్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.