RR: మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్‌ఎంసీ పరిధిలోని బాలాపూర్ డివిజన్‌లో మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.