నరసరావుపేట (మం) సత్తెనపల్లి రోడ్డులోని సాయిరాం టౌన్షిప్ యాజమాన్యం పొలాలకు వెళ్లే దారిని గోడతో మూసివేయడంపై ప్రజా సంఘాల నేతలు రైతులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. దారి వివాదం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఇలా చేయడం సరికాదన్నారు. వెంటనే దారి కల్పించకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
వార్తలు
పొలాల దారి మూసివేత.. రైతుల ఆగ్రహం


