హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత

AP: కృష్ణా జిల్లా మచిలీపట్నం లేడీస్ హాస్టల్‌లో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నలతగా ఉందనడంతో విద్యార్థినులకు ఇంజెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. కాళ్లు, చేతులు బిగుసుకుపోతున్నట్లు విద్యార్థినులు చెప్పడంతో వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి హాస్టల్ సిబ్బంది, అధికారులు తరలించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల పర్యవేక్షణ, కారణాలపై ఆరా తీస్తున్నారు.