హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NLG: పెద్దఅడిశర్లపల్లి, గుడిపల్లి మండలాల్లో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మంగళవారం పర్యటించనున్నారు. నీలంనగర్ స్టేజ్ వద్ద రూ. 37.00 లక్షల వ్యయంతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. గుడిపల్లిలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాన్ని ప్రారంభిస్తారు. భీమనపల్లిలో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.