హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం తపా తోపు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ముందుగా వెళ్తున్న స్కూటీని వెనుక నుంచి దోస్త్ వాహనం ఢీకొట్టడంతో అల్లూరు మండలానికి చెందిన శ్రీనివాసుల రెడ్డి (66) తీవ్రంగా గాయపడ్డారు. 108లో కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.