హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: అందరూ చూస్తుండగానే నరికేశాడు!

TG: HYD సైదాబాద్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ హత్య జరిగింది. హమేర్ అనే వ్యక్తిపై స్థానిక యువకుడు కత్తితో అందరూ చూస్తుండగానే ఘోరంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హమేర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. గతంలో మృతుడిపై క్రిమినల్ కేసులున్నాయని, గంజాయి బ్యాచ్‌ గొడవలే కారణమని ప్రచారం జరుగుతోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.