AP: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడి డివైడర్‌ను ఢీకొట్టింది. వైబీ ట్రావెల్స్ బస్సు చెన్నై నుంచి విశాఖ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులోని ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు


