హైదరాబాద్: 28°C
వార్తలు

అదనపు గదులు.. సమస్యలు అలాగే

ATP: గుత్తి పట్టణంలోని బాలికల ZP ఉన్నత పాఠశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. బడిలో 700 మందికి పైగా విద్యార్థులున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో నాడు-నేడు ద్వారా పనులు చేపట్టగా, సకాలంలో బిల్లులు అందకపోవడంతో గుత్తేదారులు అసంపూర్తిగా నిలిపేశారు. విద్యార్థులు తగినన్ని తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి పూర్తి చేయాలని కోరుతున్నారు.