హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంటిపై దాడి

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దుండగులు దాడి చేయటం కలకలం రేపింది. రాత్రి వేళ మోటార్ సైకిళ్లపై దుండగులు వచ్చి హసన్ ఇంటిపై దాడి చేసి.. నిప్పు పెట్టేందుకు యత్నించారు. బంగ్లా మాజీ ప్రధాని హసీనా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షకీబ్ పాల్గొన్న కొన్ని గంటల్లో ఈ ఘటన జరగటం గమనార్హం. దీంతో అతని ఇంటి వద్ద అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు.