హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నిద్రలో కండరాలు, పిక్కలు పట్టేస్తున్నాయా?

నిద్రలో పిక్కలు, తొడ కండరాలు పట్టేస్తే నిర్లక్ష్యం చేయొద్దు. శరీరంలో నీటి కొరత, పొటాషియం–మెగ్నీషియం లోపం, అధిక వ్యాయామం, వయస్సు లేదా కొన్ని అనారోగ్య సమస్యలు దీనికి కారణం కావచ్చు. ఉపశమనం కోసం కండరాలను నెమ్మదిగా స్ట్రెచ్ చేయడం, గోరువెచ్చని కాపడం పెట్టడం, తగినంత నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం మంచిది. సమస్య తరచూ వస్తే వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.