హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

హై హీల్స్ వేసుకుంటున్నారా..?

హై హీల్స్ స్టైలిష్ లుక్ ఇస్తాయనడంలో సందేహం లేదు. కానీ వీటిని తరచూ ధరిస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. ఇవి శరీరం యొక్క సహజ భంగిమను దెబ్బతీస్తాయి. దీనివల్ల వెన్నునొప్పి, మెడనొప్పి, పిక్కల కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వీటిని ధరించడం, ఎక్కువ దూరం నడవాల్సి వస్తే ఫ్లాట్ చెప్పులను ఎంచుకోవాలి.